Fri Mar 20 2026 04:21:09 GMT+0530 (India Standard Time)
భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు.. డేంజర్ బెల్స్
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1,17,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 302మంది మరణించారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 36,265 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,49,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పెరుగుతున్న
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,54,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,82,852 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,49,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

