Thu Mar 19 2026 19:40:16 GMT+0530 (India Standard Time)
తెలంగాణకు చేరవేస్తున్న నగదు 42 కోట్లు స్వాధీనం
ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరులో నలభై రెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరులో నలభై రెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. ఒక మంత్రికి సంబంధించిన నగదుగా దీనిని చెబుతున్నారు. బెంగళూరు నుంచి తెలంగాణకు తరలించేందుకు ఈ నగదును సిద్ధం చేసినట్లు సమాచారం రావడంతో ఐటీ శాఖ అధికారుల సోదాతో ఈ విషయం వెల్లడయింది.
ఒక మంత్రికి సంబంధించి...
బెంగళూరులో నిన్నటి నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అక్కడి నుంచే నగదు సరఫరా అవుతుందని అనుమానించిన ఐటీ శాఖ అనుమానితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 42 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది.
Next Story

