Sun Mar 29 2026 05:09:01 GMT+0530 (India Standard Time)
రిలీఫ్ : తగ్గిన కరోనా కేసులు
గడచిన 24 గంట్లో భారత్ లో 6,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 మంది మరణించారు.

దేశంలో ఈరోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి రోజూ పది వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే గడచిన 24 గంట్లో భారత్ లో 6,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులో 24 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్లో కరోనా యాక్టివ్ కేసులు 63,380కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరణాలు ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,31,369 మంది మరణించారని అధికారులు తెలిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.52 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు. కోలుకున్న వారి సంఖ్య 4,43,11,078 మందికి చేరుకుందని అధికారులు వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.
Next Story

