Fri Dec 05 2025 18:19:02 GMT+0000 (Coordinated Universal Time)
భారత్లో భారీగా కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో భారత్ లో 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి

భారత్లో కోవిడ్ కేసులు కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలోనే నమోదవుతున్నాయి. రోజుకూ మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.
యాక్టివ్ కేసులు...
రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలో 21,179 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది ఆందోళన కలిగించే విషయమేనని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story

