Fri Dec 05 2025 12:23:27 GMT+0000 (Coordinated Universal Time)
కుమార్తెకు ఇష్టమని పథ్నాలుగు కిలోమీటర్లు సైకిలపై వెళ్లి?
తమిళనాడులో ఒక తండ్రి కుమార్తెకు ఇష్టమని చెరుకు గడలను తలపై పెట్టుకుని ఏకంగా పథ్నాలుగు కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించాడు

సంక్రాంతి పండగ వచ్చిదంటే ఇంటిల్లి పాదీ సంతోషాలతో గడుపుతారు. ఇక పెళ్లయిన కుమార్తె, అల్లుడిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టి వారికి ఇష్టమైన పిండి వంటలు చేసి పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. చిన్న నాటి నుంచి పెంచుకున్న తన కుమార్తెకు ఇష్టమైన వాటిని సంక్రాంతికి తెచ్చి ఇచ్చేందుకు ప్రతి తండ్రి ఇష్టపడతాడు. అందుకు కష్టపడతాడు కూడా. ఆ కష్టంలో ఇష్టం ఉంది. కన్న పేగు మీద ప్రేమ ఉంది. తండ్రి ప్రేమ కోసం కూతుళ్లు ఎప్పుడూ పరితపించి పోతుంటారు.
చెరుకు గడలను...
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. తమిళనాడులో ఒక తండ్రి కుమార్తెకు ఇష్టమని చెరుకు గడలను తలపై పెట్టుకుని ఏకంగా పథ్నాలుగు కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన ఘటన చూసి నెటిజన్లు నివ్వెర పోతున్నారు. పుదుకొట్లైకి చెందిన వృద్ధుడొకరు తన కుమార్తెకు చెరుకు గడలు ఇష్టమని పథ్నాలుగు కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లి ఇచ్చి వచ్చాడు. అదీ ఆ చెరుకు గడలను తలపై పెట్టుకుని మరీ ప్రయాణించిన తీరు చూసి అందరూ ఆశర్చపోతున్నారు.
Next Story

