Tue Dec 09 2025 10:16:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏమాత్రం తగ్గని కరోనా
భారత్ లో 8,084 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరుగురు కరోనాతో మరణించారు.

భారత్ లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఎనిమిదివేలు కేసులు మూడు రోజుల నుంచి నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా భారత్ లో 8,084 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరుగురు కరోనాతో మరణించారు. నిన్న కరోనా నుంచి 4,035 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
పాజిటివిటీ రేటు....
భారత్ లో రోజు వారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా నమోదయింది. మరణాల శాతం 1.21 శాతంగా ఉంది. భారత్ లో ఇప్పటి వరకూ 4,32,36,695 మంది కరోనా బారిన పడ్డారు. 5,24,777 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 50,548 గా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,57,335 కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. యాభైవేలకు పైగా యాక్టివ్ కేసులు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
Next Story

