Thu Dec 18 2025 18:07:58 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం సభలో కునుకు : అధికారి సస్పెన్షన్
గుజరాత్ లో ముఖ్యమంత్రి సభలో నిద్రపోయిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

గుజరాత్ లో ముఖ్యమంత్రి సభలో నిద్రపోయిన అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగిస్తుండగా ముందు వరుసలో కూర్చున్న ఒక సీనియర్ అధికారి నిద్ర పోయారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ప్రభుత్వం సీరియస్ అయింది.
మున్సిపల్ అధికారిగా...
నిద్ర పోయిన అధికారి భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ గా గుర్తించారు. వెంటనే జిగర్ పటేల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే వరస కార్యక్రమాలతో అలసట చెంది కునుకు తీసినంత మాత్రాన సస్పెండ్ చేయడమేంటని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Next Story

