Fri Jan 24 2025 05:22:58 GMT+0000 (Coordinated Universal Time)
రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు
ఒక్కరోజులో 16,935 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాల సంఖ్య తగ్గడం లేదు. 51 మంది కరోనా కారణంగా మరణించారు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజుల నుంచి వరసగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక్కరోజులో 16,935 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాల సంఖ్య తగ్గడం లేదు. 51 మంది కరోనా కారణంగా మరణించారు. కోవిడ్ బారిన పడి నిన్న ఒక్కరోజు 16,069 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కోలుకునే వారి శాతం 98.47 శాతంగా నమోదయింది.
యాక్టివ్ కేసులు....
ఇక యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.33 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 1,44,264 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 4,37,67,534 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,760 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,97,510 గా నమోదయింది. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
Next Story