Wed Mar 18 2026 12:01:50 GMT+0530 (India Standard Time)
బాగా తగ్గిన కరోనా కేసులు
24 గంటల్లో భారత్లో 3,325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పదిహేడు మంది మరణించారు.

భారత్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా కరోనా కేసులు నమోదు కావడం తగ్గింది. గడిచిన 24 గంటల్లో భారత్లో 3,325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పదిహేడు మంది ఒకరోజులో కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
అప్రమత్తంగానే...
ప్రస్తుతం భారత్ లో 44,175 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగానే ఉండాలని, కోవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిందేనని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Next Story

