Wed Mar 25 2026 05:42:25 GMT+0530 (India Standard Time)
Ayodhya : అయోధ్యలో నేడు మహత్తర ఘట్టం.. గర్భగుడిలోకి బాలరాముడు
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహప్రతిష్ట జరగనుంది.అయితే ఈరోజు బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు

అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడి విగ్రహప్రతిష్ట జరగనుంది.అయితే ఈరోజు బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. నిన్న సాయంత్రమే బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. అయితే దానిని రామమందిరానికి క్రేన్ సాయంతో నిన్న గర్భగుడిలోకి చేర్చిన బాలరాముడి విగ్రహాన్ని నేడు ప్రతిష్టించనున్నారు.
మధ్యాహ్నం నుంచి...
ఈరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు అయోధ్య రామాలయంలో సంకల్పం కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆలయ ట్రస్టీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పూజలు నేడు జరపనుననారు. గణేశ పూజతో ప్రారంభంచి మండప ప్రవేశాన్ని చేస్తారు. బాల రాముడి విగ్రహానికి జలాధివాసం, గంధాదివాసంతో పాటు సాయంత్రం ఆరాధన కూడా నిర్వహించనున్నారు.
Next Story

