Fri Dec 05 2025 12:47:41 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై మరోసారి దాడి
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై మరోసారి దాడి జరిగింది

హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు నల్లఇంకుతో దాడికి దిగారు. ఇటీవల పార్లమెంటులో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ జై పాలస్తీనా అనడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. దాడికి పాల్పడిన వారు పోస్టర్లు కూడా అంటించారు. అయితే దాడి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఒవైసీ ఇంటికి చేరుకుని అక్కడ ఇంకును, పోస్టర్లను తొలగించారు.
అసద్ ఆరోపణలివే...
సీసీటీవీ ఫుటేజీలను చూసి దాడిచేసిన వారిని ఎవరో గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటి ముందు భారీ భద్రతను పెంచారు. ఇది భజరంగ్ దళ్ కార్యకర్తల పనేనని అనుమానిస్తున్నారు. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తన నివాసంపై పదే పదే దాడులు చేస్తున్నారని, ఇది కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే జరిగిందని ఆయన ఆరోపించారు. పార్లమెంటు సభ్యుల భద్రతపై ఆయన స్పీకర్ ఓంబిర్లాను ప్రశ్నించారు. పిరికి పంద చర్యలు మానుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
Next Story

