Sat Mar 07 2026 18:40:17 GMT+0530 (India Standard Time)
నెదర్లాండ్స్ లో హైదరాబాదీ మృతి !
హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ కు చెందిన అబ్దుల్ హదీ కొన్నాళ్లుగా నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో ఓ అపార్ట్ మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్ లో

హైదరాబాద్ కు చెందిన వ్యక్తి యూరప్ దేశం నెదర్లాండ్స్ లో మరణించాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ కు చెందిన అబ్దుల్ హదీ కొన్నాళ్లుగా నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో ఓ అపార్ట్ మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగలు వెలువడ్డాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైన అబ్దుల్ హదీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అతను ప్రాణాలు విడిచాడు.
అబ్దుల్ హదీ మరణంతో ఆసిఫ్ నగర్ లో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాగైన్ అబ్దుల్ హదీ మృతదేహాన్ని నెదర్లాండ్స్ నుంచి భారత్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Next Story

