Sat Apr 04 2026 09:53:43 GMT+0530 (India Standard Time)
Breaking : ఛత్తీస్గఢ్ లో లో భారీ ఎన్ కౌంటర్ .. పది మంది మావోల మృతి
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పురంగెల్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవాకశముందని అధికారులు చెబుతున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారీ గా మావోయిస్టులు మరణించారు.
వరస ఎన్కౌంటర్...
ఛత్తీస్గఢ్ లో ఇటీవల వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మావోయిస్టుల కోసం భద్రతాదళాలు జల్లెడపడుతున్నాయి. వరస ఎన్కౌంటర్ లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఇంకా మావోయిస్టుల కోసం భద్రతాదళాలు వెతుకులాట కొనసాగుతున్న తరుణంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఈ తాజా ఎన్కౌంటర్ జరిగింది.
Next Story

