Fri Dec 05 2025 17:44:40 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 82 కోట్ల రూపాయల విలువ చేసే 5.5 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 82 కోట్ల రూపాయల విలువ చేసే 5.5 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి ఢిల్లీకి చేరుకున్న లేడీ నుంచి ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలో పెద్దయెత్తున డ్రగ్స్ ఉన్నట్లు తేలడంతో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు.
దోహా నుంచి ఢిల్లీకి...
కొకైన్ ను గోల్డ్ కలర్ చాక్లెట్స్ లో నింపి ఢిల్లీకి తీసుకు వచ్చేందుకు ఈ మహిళ ప్రయత్నించింది. అయితే ఎక్కడికి ఈ కొకైన్ ను తీసుకెళుతుంది? ఎవరు దీని వెనక ఉన్నారన్న దానిపై పోలీసులు ఆ మహిళను విచారిస్తున్నారు. పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కొకైన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

