Sun Dec 08 2024 17:47:25 GMT+0000 (Coordinated Universal Time)
చీపుర్లు, కర్రలతో హెడ్ మాస్టర్ ను చితక్కొట్టిన విద్యార్థినులు
కట్టేరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న చిన్మయానంద్ అనే వ్యక్తి, హాస్టల్లోని ఒక విద్యార్థిని..
ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు తమ హెడ్ మాస్టర్ ను చీపుర్లు, కర్రలతో చితక్కొట్టారు. ఇంతకీ అతనేం చేశాడని అలా కొట్టారో తెలుసా ? తమ తోటి విద్యార్థినిని ఆ హెడ్ మాస్టర్ లైంగికంగా వేధించాడు. విషయం తెలిసిన విద్యార్థినులు ఆగ్రహంతో.. మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. 'ఇక బుద్ధొచ్చింది తల్లో' అనేంత వరకు చితకబాదారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన కట్టేరి ప్రభుత్వ పాఠశాలకు చెందిన హాస్టల్ లో జరిగిన ఘటన ఇది.
కట్టేరి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న చిన్మయానంద్ అనే వ్యక్తి, హాస్టల్లోని ఒక విద్యార్థినితో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై దాదాపుగా లైంగిక హింసకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మిగతా హాస్టల్ విద్యార్థినిలు.. కర్రలు, చీపుర్లు అందుకుని.. అతడిని చుట్టు ముట్టి చితకబాదారు. విద్యార్థుల దెబ్బలు తాళలేక అతడు గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోని నెట్టింట్లో షేర్ చేయగా.. ఆ విద్యార్థినుల ధైర్య సాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Next Story