Sun Apr 05 2026 21:30:44 GMT+0530 (India Standard Time)
హోర్ముజ్ జలసంధిని దాటిన మరో భారత నౌక
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందిం

పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందింది. హోర్ముజ్ జలసంధిని మరో భారత నౌక సురక్షితంగా దాటింది. 'గ్రీన్ ఆశా' ట్యాంకర్ హోర్ముజ్ జలసంధిని దాటినట్టు సమాచారం అందుతుంది. ఎల్పీజీతో భారత్కు సేఫ్గా 'గ్రీన్ ఆశా' ట్యాంకర్ ప్రయాణం సాగుతుందని అనధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
భారత్ చేరుకున్న మత్స్యకారులు...
మరొకవైపు భారత్ కు చెందిన మత్య్సకారులు ఇరాన్ నుంచి సురక్షితంగా భారత్ కు చేరుకున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్లో భారతీయ మత్య్సకారులు గత కొంత కాలంగా చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా భారత్ కు చేర్చారు. ఆర్మేనియా మీదుగా 345 మంది మత్య్సకారులు భారత్కు చేరుకున్నారు.
Next Story

