Fri Dec 05 2025 10:48:45 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక అంతా 144 వ సెక్షన్
కర్ణాటక హైకోర్టు నేడు హిజాబ్ వివాదంపై తీర్పు నివ్వనుంది. తీర్పు నేపథ్యంలో కర్ణాటక అంతటా 144వ సెక్షన్ అమలు చేసింది.

కర్ణాటక హైకోర్టు నేడు హిజాబ్ వివాదంపై తీర్పు నివ్వనుంది. తీర్పు నేపథ్యంలో కర్ణాటక అంతటా ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. హిజాబ్ వివాదం ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవును ప్రకటించింది.
హిజాబ్ వివాదంపై తీర్పు....
హిజాబ్ వివాదం కర్ణాటకను ఊపేసింది. అనేక విద్యాసంస్థలలో హిజాబ్ వివాదం తలెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. పాఠశాలలు, కళాశాలల్లో డ్రెస్ కోడ్ పాటించాలని పేర్కొంది. అయితే దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ఇరు వర్గాల విచారణను వినింది. నేడు తీర్పు చెప్పనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అంతటా 144వ సెక్షన్ విధించారు.
Next Story

