Wed Mar 18 2026 23:15:44 GMT+0530 (India Standard Time)
రేవంత్‌కు అదనపు భద్రత : హైకోర్టు ఆదేశం
రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు చెప్పింది

రేవంత్ రెడ్డికి అదనపు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు చెప్పింది. తనకు అదనపు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో కొందరు రాళ్లు, టమాటాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి భద్రతపై పార్టీ నేతలు, ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందారు.
ప్రభుత్వ వాదనను...
హైకోర్టును ఆశ్రయించడంతో అదనపు భద్రతను కల్పించాలని తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున న్యాయవాది మాట్లాడుతూ తాము ఇప్పటికే 69 మంది సిబ్బందితో భద్రతను కల్పిస్తున్నామని చెప్పింది. అయినా అదనపు భద్రతను కల్పించాలంటూ హైకోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డి ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రకు అనబంధంగా గత 23 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

