Fri Dec 05 2025 18:24:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె రేంజి వేరు.. స్థాయి వేరు.. పాక్ లో జ్యోతి మల్హోత్రా సెక్యూరిటీ చూశారా?
పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హరియాణాలోని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టు అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హరియాణాలోని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో ఆమెకు ఆరుగురు గన్మెన్లతో సెక్యూరిటీ కల్పించారంటూ వీడియో వైరల్ అవుతూ ఉంది. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌ను జ్యోతి సందర్శించిన సమయంలో ఆరుగురు సాయుధులు ఆమె చుట్టూ ఉన్నారని స్కాట్లాండ్కు చెందిన యూట్యూబర్ కాలమ్ మిల్ తెలిపారు. కాలమ్ మిల్ తన ఛానల్ పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. అందులో జ్యోతిని లాహోర్ అనార్కలీ బజార్లో కలుసుకున్నారు. ఆ సమయంలో ఆమె చుట్టూ ఏకే 47 తుపాకులు పట్టుకుని పలువురు సాయుధులు ఉన్నారు.
Next Story