Sat Mar 07 2026 23:38:38 GMT+0530 (India Standard Time)
అమర్నాథ్ యాత్రికులకు జూన్ 1నుంచి నుంచి హెలికాప్టర్ సౌకర్యం
అమర్నాథ్ యాత్రికుల కోసం జూన్ ఒకటో తేదీ నుంచి హెలికాప్టర్ బుకింగ్ అందుబాటులోకి రానుంది.

అమర్నాథ్ యాత్రికుల కోసం జూన్ ఒకటో తేదీ నుంచి హెలికాప్టర్ బుకింగ్ అందుబాటులోకి రానుంది. అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్ లైన్ లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. అమర్నాధ్ యాత్రికులు హెలికాప్టర్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఆన్ లైన్ లో బుకింగ్...
అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తన అధికారిక వెబ్ సైట్ లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేయనుంది. కాగా యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచే ప్రారంభమయిన సంగతి తెలిసిందే. యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Next Story

