Tue Mar 24 2026 10:36:07 GMT+0530 (India Standard Time)
కొత్త పార్లమెంటు భవనంలో వాటర్ లీకేజీ.. ఎక్స్‌లో కాంగ్రెస్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాజాగా పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ అవుతుంది. ఈ లీక్ అవుతోన్న దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసి, కేంద్రంపై విమర్శలు గుప్పించింది.
వాయిదా తీర్మానం ఇస్తామని...
“బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్. పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీ జరిగింది. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలోని సమస్యలను ఇది వెల్లడి చేస్తోంది. దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతాను” అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు
Next Story

