Fri Dec 05 2025 11:12:51 GMT+0000 (Coordinated Universal Time)
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందారు

భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందారు. వారణాసిలో గంగానది నీటిమట్టం పెరుగుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు 41 మంది మృతి చెందారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలను నిలిపి వేశారు.
రాకపోకలు నిలిచిపోయి...
హిమాచల్‌ప్రదేశ్‌లోని బడా బంగాల్లో భారీ వరదలకు ప్రభుత్వ భవనాలు కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చండీగఢ్- మనాలి మధ్య నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి. మరొకవైపు రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలోనూ వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

