Fri Dec 05 2025 11:26:46 GMT+0000 (Coordinated Universal Time)
నటి కస్తూరి బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ
నటి కస్తూరి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు మధురై కోర్టులో విచారణ జరగనుంది

నటి కస్తూరి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు మధురై కోర్టులో విచారణ జరగనుంది. సినీ నటి కస్తూరి తెలుగు కుటుంబాలపై చేసిన వ్యాఖ్యలపై ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కస్తూరి మధురై కోర్టును ఆశ్రయించారు. తాను బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారని కస్తూరి తన బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు.
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి...
గత కొంతకాలంగా కస్తూరి పోలీసుల కన్ను గప్పి తిరుగుతున్నారు. ఇంటికి కూడా తాళం వేసి ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలను చేసినందుకు కస్తురిపై చెన్నైతో పాటు మధురై పోలీస్ స్టేషన్ లలో కూడా కేసులు నమోదు కావడంతో ఆమె ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
Next Story

