Thu Dec 18 2025 12:05:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఆసుపత్రిలో జగ్గీ వాసుదేవ్.. బ్రెయిన్ సర్జరీ చేయడంతో?
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ నెల 17న మెదడులో బ్లీడింగ్ కావడంతో్ ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరిగింది. అయితే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం ఆయన కోలుకుంటున్నారని, అంచనాల కంటే వేగంగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు.
మెదడులో బ్లీడింగ్ కావడంతో...
ఇటీవలే జగ్గీ వాసుదేవ్ శివరాత్రి రోజున జరిగిన వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి కూడా హాజరయ్యారు. ఉత్సవాల్లో ఆయన నృత్యాలు కూడా చేశారు. అయితే గత నాలుగు నెలల నుంచి ఆయన తీవ్రమైన తలొనొప్పితో బాధపడుతున్నారని, పరీక్షలు చేయగా మెదడులో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు. అయితే జగ్గీ వాసుదేవ్ కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Next Story

