Tue Jan 06 2026 22:20:40 GMT+0000 (Coordinated Universal Time)
మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. భారత్ లోనే ఎక్కడంటే?
శ్రీనగర్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శ్రీనగర్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్మార్గ్ ఈ శీతాకాలంలో ఇప్పటివరకు అత్యంత చలి తీవ్రత నమోదయింది. ఆదివారం మరోసారి మంచు కురవడంతో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 8.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లా గుల్మార్గ్లో గత రెండు రాత్రులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. శనివారం, ఆదివారం రాత్రుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
శ్రీనగర్, పహల్గామ్లోనూ...
రాజధాని శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది శనివారం రాత్రి నమోదైన మైనస్ 3.2 డిగ్రీల కంటే స్వల్పంగా తక్కువగా ఉందని అధికారులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో మైనస్ 4.8 డిగ్రీల సెల్సియస్ చలి నమోదైంది. ఖాజిగుండ్‌లో మైనస్ 2 డిగ్రీలు, కోకర్నాగ్లో మైనస్ 1.2 డిగ్రీలు, ఉత్తర కాశ్మీర్ కుప్వారాలో మైనస్ 1.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ప్రస్తుతం కాశ్మీర్ లోయలో ‘చిల్లా-ఏ-కలాన్’ కొనసాగుతోంది. ఇది 40 రోజుల పాటు ఉండే తీవ్రమైన చలి కాలం. ఈ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి దిగువకు పడిపోవడం సాధారణం. మంచు కురిసే అవకాశాలు కూడా ఇదే సమయంలో ఎక్కువగా ఉంటాయి.అయితే, ఈ సీజన్లో ఇప్పటివరకు లోయలోని సమతల ప్రాంతాల్లో మంచు పడలేదని అధికారులు తెలిపారు.
Next Story

