Fri Dec 05 2025 11:27:16 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు
నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అధ్యక్షత వహించనున్నారు.

నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరు కానున్నారు.
కొన్ని రకాల వస్తువులపై...
ప్రస్తుతం కొన్ని రకాల వస్తువులపై ఉన్న జీఎస్టీ శాతాన్ని తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు15వ తేదీన దీపావళి నుంచి జీఎస్టీ శాతం కొన్ని వస్తువులపై తగ్గుతాయని చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను నిర్మలా సీతారామన్ తీసుకోనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పయ్యావుల కేశవ్ లు పాల్గొననున్నారు.
Next Story

