Fri Dec 05 2025 20:46:12 GMT+0000 (Coordinated Universal Time)
GST : వావ్.. దసరాకు ముందే మోదీ కానుక.. దేశ ప్రజలకు గుడ్ న్యూస్
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ హామీని అమలు పర్చే విధంగా జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.భారతదేశంలో పరోక్ష పన్నుల విధానంలో మార్పులను తీసుకు వస్తూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలపడంతో ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ నెల 22 తేదీ నుంచి జీఎస్టీ తగ్గించడంతో వస్తువులు చౌకగా లభించనున్నాయి. నిత్యావసర వస్తువులతో పాటు ఎరువులు, చెప్పులు, బట్టలు వంటి వస్తువులపై జీఎస్సీ తగ్గింది. ఇవి గతంలో పన్నెండు శాతం, ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ విధిస్తుండగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇవి ఐదు శాతం, పద్దెనిమిది శాతం పన్నుల శ్లాబ్ లలోకి రానున్నాయి.
పాల ఉత్పత్తులు...
ప్రధానంగా నిత్యం ఉపయోగించే పాల ఉత్పత్తులు తగ్గనున్నాయి. వెన్న, నెయ్యి,వంటి వస్తువులపై గతంలో పన్నెండు శాతం పన్ను ఉండగా, నేడు ఐదు శాతానికి తగ్గిందచారు. ఇక పాస్తా, స్టార్చ్, మాల్ట్, కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తుల పై గతంలో పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం పన్ను ఉండగా ఇప్పుడు వీటివని ఐదు శాతానికి తగ్గించారు. ఇక డ్రైఫ్లూట్స్ ధరలు కూడా తగ్గతనున్నాయి. బాదం, పిస్తా, హాజెల్ నట్స్, జీడిపప్పు, ఖర్జూరం వంటి వస్తువులను పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉండగా ఐదు శాతానికి తగ్గించారు. చక్కెర, స్వీట్లపై కూడా ఐదు శాతం పన్ను ఈ నెల22వ తేదీ నుంచి విధించానున్నారు.వీటితో పాటు కూరగాయల నూనె, జంతువుల కొవ్వు, సాసెజ్, మాంసం, చేపలు వంటి ప్యాక్ చేసిన ఉత్పత్తులపై కూడా ఇక ఐదు శాతం పన్ను విధిస్తారు.
ఎరువులు.. మందులు...
ఎరువులపై పన్ను ప్రస్తుతం పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉండగా వాటిని ఐదు శాతానికి తగ్గించారు. ప్రాణాలను రక్షించే మందులతు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, కొన్నివైద్యపరికరాలపై జీఎస్టీని పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం వరకూ ఉండగా, అవి ఐదు శాతం లేదా జీరోకి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కొన్ని విద్యుత్తు ఉపకరణాలపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శఆతం వరకూ తగ్గించారు. చెప్పులు, దుస్తులపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్ిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో అనేక వస్తువులు ఈ నెల 22వ తేదీ తర్వాత గణనీయంగా ధరలు తగ్గే అవకాశముంది.
Next Story

