Sat Dec 06 2025 02:11:35 GMT+0000 (Coordinated Universal Time)
నైసార్ ప్రయోగం విజయవంతం
జీఎస్ఎల్వీ ఎఫ్ 16తో నైసార్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది

జీఎస్ఎల్వీ ఎఫ్ 16తో నైసార్ ఉపగ్రహం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. నిసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 16 ప్రవేశపెట్టింది. దీంతో ఇస్రోశాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 11,200 కోట్ల రూపాయలతో నాసా, ఇస్రో నైసార్ ఉపగ్రహాన్ని ఉమ్మడి ప్రయోగం చేసింది. ఈరోజు సాయంత్రం 5.40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి నైసార్ ఉపగ్రహం దూసుకెళ్లింది. భూమి అణువణువును 12 రోజులకోసారి నిసార్ స్కాన్ చేసేస్తుంది. అడవులు, మైదాన ప్రాంతాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వన రులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడ పట్టనుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తుంది. కొండచరియలు విరిగిపడటాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవ డాన్ని ముందే గుర్తించేందుకు వీలుంటుంది.
పలు పరిశోధనలకు, ప్రయోగాలకు...
ఇది అమెరికా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ప్రయోగం కావడం విశేషం. ఒక ట్రక్కు పరిమాణంలో, 2,393 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్16 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలిస్తుంది. దీనిలో నాసాకు చెందిన ఎల్-బ్యాండ్, ఇస్రోకు చెందిన ఎస్-బ్యాండ్ రాడార్లు, రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపా ర్చర్ రాడార్, 12 మీటర్ల వ్యాసం ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్ యాంటెన్నాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అడవులు, మైదానాలు, కొండప్రాంతాలు, మంచుపర్వాతాలను అధ్యయనంచేయనుంది.
Next Story

