Wed Jan 28 2026 18:57:54 GMT+0000 (Coordinated Universal Time)
నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్15
శ్రీహరి కోట నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది

షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో వంద ప్రయోగాలు చేసి రికార్డు సృష్టించింది.
వందో ప్రయోగం...
జఎన్వీఎస్-02 ఉపగ్రహం అనేది ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు ఉంటుంది. ఇది కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోదిగా శాస్త్రవేత్తలు చెప్పారు. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు.
Next Story

