Sun Mar 15 2026 11:00:43 GMT+0530 (India Standard Time)
Breaking : GSLV F14 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమయింది. సరిగ్గా 5.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

శ్రీహరికోటలో నేడు జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం విజయవంతమయింది. సరిగ్గా 5.35 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఇన్శాట్ 3ని మోసుకెళ్లే జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్ ను నింగిలోకి దూసుకెళ్లిందది. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ర్యాకెట్ ను ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం జరిగింది.
పదేళ్లపాటు సేవలు...
నిన్న దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. ఇది 2,275 కిలోల బరువైన ఇన్శాట్ 3 డీఎస్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు రూపొందించారు. వాతావరణ పరిస్థితులతో పాటు, ప్రకృతి విపత్తుల హెచ్చరికల కోసం ఈ ర్యాకెట్ ఉపయోగపడనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. వివిధ దశల్లో ఈ ర్యాకెన్ సురక్షితంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది పదేళ్ల పాటు సేవలందించనుంది. GSLV F14 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
Next Story

