Sat Dec 27 2025 04:16:03 GMT+0000 (Coordinated Universal Time)
India : రెండు వేల కోట్లు చేరడంతో అంతా ఖుషీ
బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా మూలుగుతున్న అన్ క్లెయిమ్డ్ మనీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది

బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా మూలుగుతున్న అన్ క్లెయిమ్డ్ మనీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. దాదాపు రెండువేల కోట్ల విలువైన క్లెయిమ్ చేయని నిధులు వాటి వారసులకు చేరాయి. బ్యాంకుల్లో గత కొన్నేళ్లుగా నగదును ఉంచి వారసులెవరో పేర్కొనకుండా, క్లెయిమ్ చేయని కోట్ల రూపాయల డబ్బును వాటి వారసులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ (కార్యక్రమం ప్రారంభించింది. దీనికి ద్వారా ఇప్పటివరకు రూ.2,000 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని నిధులు అసలు యజమానులకు చేరాయి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో ప్రభుత్వం ఈ విషయం తెలిపింది.
వివిధ రూపాల్లో బ్యాంకుల్లో...
ఈ మొత్తంలో బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్లు, డివిడెండ్లు, షేర్లు, పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో నిలిచిపోయిన డబ్బు ఉంది. భారీగా క్లెయిమ్ కాని ఆస్తులు బ్యాంకుల్లో వివిధ డిపాజిట్ల రూపంలో పేరుకుపోయి కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయి. భారతదేశంలో క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిమాణం భారీగా ఉందని అంచనాలు ఉన్నాయి. తమ వారసులకు చెప్పకుండా కొందరు, సరైన ఆధారాలు చూపించని మరికొందరు ఈ డబ్బును బ్యాంకుల నుంచి వెనక్కు తీసుకోలేుద. దీంతో కేంద్ర ప్రభుత్వం డబ్బు యజమాని వారసులకు అప్పగించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా గత మూడు నెలల నుంచి భారీగా ప్రచారాన్ని కూడా చేస్తుంది.
క్లెయిమ్ చేయకుండా...
బ్యాంకుల్లో క్లెయిమ్ కాని డిపాజిట్లు సుమారు 78,000 కోట్ల వరకూ ఉన్నాయి. బీమా పాలసీల ద్వారా చెల్లించాల్సిన, కానీ నిలిచిపోయిన మొత్తం 14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో క్లెయిమ్ కాని నిధులు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్లెయిమ్ కాని డివిడెండ్లు దాదాపు 9,000 కోట్లున్నాయి. ఖాతాదారుడు లేదా వారి చట్టబద్ధ వారసులు చాలాకాలం పాటు డబ్బును తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుంది.10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం లావాదేవీలు జరగని సేవింగ్స్, కరెంట్, ఎఫ్డీ, ఆర్డీ ఖాతాలు, గడువు దాటినా చెల్లించని బీమా పాలసీ మొత్తాలు, బ్యాంక్ ఖాతా మార్పు, ఖాతా మూసివేత, వివరాలు అసంపూర్ణంగా ఉండటం వల్ల క్రెడిట్ కాకుండా ఉన్న మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్లు, డివిడెండ్లు, చట్టబద్ధ సంస్థలకు బదిలీ అయిన క్లెయిమ్ కాని షేర్లు, డివిడెండ్లు సాధారణ ప్రక్రియలో క్లెయిమ్ కాని పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉద్యోగం కోసం వలసలు, సంప్రదింపు వివరాల మార్పు, పాత బ్యాంక్ ఖాతాల మూసివేత, కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం వంటి కారణాలతో ఈ ఆస్తులు క్లెయిమ్ కాకుండా మిగిలిపోతున్నాయని అధికారులు తెలిపారు.
Next Story

