Thu Mar 19 2026 02:05:45 GMT+0530 (India Standard Time)
వచ్చే నెల మొదటి వారంలో గవర్నర్ల సదస్సు
ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది

ఆగస్టు మొదటి వారంలో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి జల్ దీప్ ధన్కర్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ సీఈవో, హోంశాఖ, ఇతర కీలక ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు.
వివిధ అంశాలపై...
వివిధ అంశాలపై గవర్నర్ల సదస్సులో చర్చించనున్నారు. దీంతో పాటు రాజ్యాంగ పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో గవర్నర్ల పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
Next Story

