Fri Dec 05 2025 12:38:30 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : శబరిమలకు వెళ్లేవారికి హై అలెర్ట్
శబరిమలకు వచ్చే వారికి ప్రభుత్వం సూచనలు చేసింది. పంబ నదిలో స్నానం చేయడంపై నిషేధం విధించింది

శబరిమలకు వచ్చే వారికి ప్రభుత్వం సూచనలు చేసింది. పంబ నదిలో స్నానం చేయడంపై నిషేధం విధించింది. భారీ వర్షాల కారణంగా పంబ నది స్నానాలపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా శబరిమల సన్నిధానం తో పాటు పంబ వద్ద పంబ నదిలో స్నానం చేయడాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. నీటి మట్టాలు పెరిగిన నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఈ పరిమితిని ప్రకటించారు, యాత్రికులు పంబ త్రివేణి వద్ద స్నానం చేయడం లేదా నదిలోకి ప్రవేశించకూడదని తెలిపారు.
పంబ నదిలో స్నానం నిషేధం...
పంబ త్రివేణి వద్ద వాహనాల పార్కింగ్ కూడా తాత్కాలికంగా పరిమితం చేశారు. పంబ - సన్నిధానం మార్గాన్ని నిరంతరంగావర్షాలు పడుతున్నందున వశబరిమల ఆలయానికి ఎక్కేటప్పుడు యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం చెబుతుంది. జారిపడే అవకాశముందని, తగిన జాగ్రత్తలతో శబరిమల ఆలయానికి చేరుకోవాలని తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. పంబ నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున యాత్రికులు స్నానం చేయవద్దని కోరారు.
Next Story

