Thu Mar 19 2026 13:13:14 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
నేటి నుంచి తమిళనాడులో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించింది

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో కోవిడ్ ఆంక్షలను రాష్ట్రాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలను ఎత్తివేశాయి. తాజాగా తమిళనాడు కూడా ఆంక్షలను ఎత్తివేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి తమిళనాడులో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించింది. అలాగే ప్రతి ఆదివారం విధించే లాక్ డౌన్ ను కూడా ఇకపై విధించరు.
పాఠశాలలను కూడా...
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 7వ తేదీ నుంచి తమిళనాడులో నైట్ కర్ఫ్యూను అమలు చేశారు. దీంతీో పాటు వచ్చే నెల ఒకటి నుంచి విద్యాసంస్థలను కూడా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమిళనాడులో ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసినట్లయింది.
Next Story

