Sun Nov 03 2024 15:18:09 GMT+0000 (Coordinated Universal Time)
సుందర్ పిచాయ్ కు గూగుల్ ఉద్యోగుల బహిరంగ లేఖ
ఈ నేపథ్యంలో తాజాగా 1400 మంది గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల తొలగింపులు..
ప్రముఖ టెక్ సంస్థ అయిన గూగుల్.. ఇప్పటివరకూ 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 1400 మంది గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కంపెనీ ఉద్యోగుల క్షేమం కోసం చర్యలు చేపట్టాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. కంపెనీలో ప్రస్తుతం కొత్త నియామకాలను చేపట్టవద్దని ఉద్యోగులు తమ లేఖలో సూచించారు. అలాగే తొలగింపులకు ముందు.. రాజీనామాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
భవిష్యత్ లో గూగుల్ నియామకాలు చేపడితే.. తొలుత తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. యుద్ధం, ఇతర మానవ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాల్లోని గూగుల్ ఉద్యోగులను తొలగించకూడదని కూడా లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగం పోతే వీసా సంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారికి సంస్థ ప్రత్యేకంగా సహాయం అందించాలని డిమాండ్ చేశారు. గూగుల్ లో తొలగింపుల పర్వం మొదలయ్యాక.. తొలిసారిగా ఉద్యోగులు బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story