Fri Dec 05 2025 17:33:44 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్
తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది. సికింద్రాబాద్ - తిరుపతికి వందేభారత్ రైలు ప్రవేశపెట్టనుంది

తిరుమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. సికింద్రాబాద్ - తిరుపతికి వందేభారత్ రైలు ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ట్రయల్ రన్ ను కూడా పూర్తి చేశారు. అత్యంత వేగంగా, సౌకర్యవంతమైన రైలు తిరుపతికి వేయడం వల్ల ఆదాయం కూడా భారీగా సమకూరుతుందని రైల్వే శాఖ భావిస్తుంది.
వచ్చే నెలలో....
తిరుపతి వెళ్లే రైళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అందులోనూ సికింద్రాబాద్ లో బయలుదేరి విజయవాడ మీదుగా వెళ్లే రైలుకు మరింత డిమాండ్ ఉంటుంది. త్వరలోనే ఈ రైలు సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా తిరుపతికి వెళ్లేందుకు పట్టాలెక్కనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. బహుశ ప్రధాని తెలంగాణ పర్యటనలో ఈ రైలు ప్రారంభమయ్యే అవకాశముందని చెబుతున్నారు. వచ్చే నెల 13న ప్రధాని హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఈ రైలును ప్రారంభించే అవకాశాలున్నాయి.
Next Story

