Mon Mar 02 2026 14:39:46 GMT+0530 (India Standard Time)
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. నేడు ఆఖరి గడువు
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్

భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్. పదో తరగతి ఉత్తీర్ణుతలయితే చాలు.. మంచి జీతంతో పాటు అలవెన్సులు కూడా లభిస్తాయి. అయితే నేటితో దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఈరోజు రాత్రి లోపు దరఖాస్తు చేసుకోవాలని, రైల్వే రిక్రూట్ బోర్డు వెబ్ సైట్ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
మొత్తం ఖాళీలు...
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. సికింద్రాబాద్ రీజియన్ లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లో ఐటీై అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు ఎల్లుండి చివరి తేదీ కాగా, 5-14 తేదీల్లో అప్లికేషన్ సవరణ చేసుకునే వీలుంది. పూర్తి వివరాలకు రైల్వే రిక్రూట్ బోర్డు వెబ్ సైట్ లో చూడవచ్చు.
Next Story

