Fri Dec 05 2025 16:57:02 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ డీఏ , డీఆర్‌ను మరో 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 49.19 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల పెన్షనర్లు లాభం పొందనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.
డీఏ పెంచుతూ...
ప్రస్తుతం ఉన్న 55 శాతం ప్రాథమిక వేతనం, పెన్షన్‌పై 3 శాతం పెంపు అమలులోకి వస్తుందని, ఇది జూలై 1, 2025 నుంచి వర్తిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డీఏ, డీఆర్ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి రూ.10,083.96 కోట్ల భారం పడనుంది. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం నిర్దేశించిన ఫార్ములానే ఈ పెంపుకు అనుసరించామని మంత్రి వివరించారు.
Next Story

