Sun Aug 07 2022 18:37:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్రైడే.. షాకిచ్చిన గోల్డ్

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. శ్రావణమాసం ఆరంభం నుంచే బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ మాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. బంగారం తరగని వస్తువు. అలాగే దాని రూపం మార్చినా విలువ తగ్గదు. అందుకే దానికి అంత విలువ. బంగారం భారతీయ సంస్కృతిలో ఒక భాగమై పోయింది. పేద - ధనిక తేడా లేకుండా తమకున్న స్థాయిలో కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆభరణాలుగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో బంగారం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే బంగారం ధరలు పెరిగినా పెద్దగా ఎవరూ లెక్క చేయడం లేదు.
పెరిగిన ధరలు....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై 350 రూపాయలు పెరిగింది. వెండి కిలోపై రూ.220 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,820 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,500 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 63,200 రూపాయలుగా ఉంది.
Next Story