Sun Mar 22 2026 01:42:09 GMT+0530 (India Standard Time)
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఎదురైతై ఆ ప్రభావం ఖచ్చితంగా బంగారం పైన పడుతుంది. నిపుణులు చెప్పే మాట ఇది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతుంది. ఈ సమయంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 44,960 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,050 రూపాయలుగా ఉంది. పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

