Sat Mar 21 2026 23:52:10 GMT+0530 (India Standard Time)
మహిళలకు శుభవార్త... బంగారం ధర తగ్గింది
వారం రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారి తగ్గడం విశేషం. పది గ్రాములకు 250 రూపాయలు ధర తగ్గింది.

బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో? ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. గత వారం రోజుల నుంచి వరసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పసిడి కొనటం కష్టమేననిపించింది. కొందరు ముందు జాగ్రత్తగా ధరలు మరింత పెరగక ముందే బంగారాన్ని కొనుగోలు చేశారు. కానీ వారం రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారి తగ్గడం విశేషం. పది గ్రాములకు 250 రూపాయలు ధర తగ్గింది.
హైదరాబాద్ లో.....
తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,100 రూపాయలుగా ఉంది. బంగారం పై పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి సమయని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

