Sat Mar 21 2026 20:46:19 GMT+0530 (India Standard Time)
స్థిరంగా బంగారం ధరలు
కొన్నాళ్లుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు కొంత బ్రేక్ పడింది. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి

కొన్నాళ్లుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఈరోజు కొంత బ్రేక్ పడింది. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజల నుంచి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతకు ముందు స్వల్పంగా తగ్గాయి. పెరిగినా, తగ్గినా బంగారం కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పసిడి ప్రియులు బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల తో సంబంధం లేకుండా కొనుగోలు చేయడం తోనే మార్కెట్ కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వెండి మాత్రం...
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,990 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,090 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి మూడు వందలు పెరిగి ప్రస్తుతం కిలో వెండి 65,500 రూపాయలుగా ఉంది.
Next Story

