Sat Mar 21 2026 20:46:06 GMT+0530 (India Standard Time)
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పై చూపుతుందని, అందుకే బంగారం ధరలపై హెచ్చుతగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక రానున్నది పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
బంగారం ధరలు....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,800 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,800 రూపాయలుగా ఉంది. అయితే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కన్పిస్తున్నాయి. కిలో వెండి ధర 61,000 రూపాయలుంది.
Next Story

