Sun Feb 01 2026 19:28:36 GMT+0000 (Coordinated Universal Time)
పసిడిప్రియులకు ఈ న్యూస్ ఎలా చెప్పాలి?
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.650లు పెరిగింది

బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటి ధరలకు అదుపు వేయలేని పరిస్థితి. అందుకు అనేక కారణాలుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, భారత ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలు రావడం ఖాయమని చెబుతున్నారు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పెరిగిన వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.650లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,000 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 81,800 రూపాయలకు చేరుకుంది.
Next Story

