Sat Mar 21 2026 23:52:10 GMT+0530 (India Standard Time)
స్థిరంగా బంగారం ధరలు
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు లేదు.

బంగారం ధరలు పెరిగితే అయ్యా అంటాం. అదే తగ్గితే భలే ఛాన్స్ అంటాం. స్థిరంగా ఉంటే పరవాలేదు కొనుగోలు చేయొచ్చు అనుకుంటాం. బంగారం పట్ల ఉండే మక్కువ మనల్ని ఇదే ఆలోచలనకు తెప్పిస్తుంది. ముఖ్యంగా పుత్తడి అంటే ఇష్టపడే మహిళలు బంగారం ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ లెక్కలు వేసుకుంటుంటారు. వ్యాపారులు కూడా బంగారం ధరలను బట్టి ప్రకటనలు గుప్పిస్తుంటారు.
హైదరాబాద్ మార్కెట్ లో....
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు లేదు. ఇది మహిళలకు కొంత ఊరటినిచ్చే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,480 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.
Next Story

