Thu Mar 19 2026 08:21:55 GMT+0530 (India Standard Time)
కొనాలంటే ఇబ్బందే మరి
దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్నది నిపుణుల అంచనా. అనేక కారణాలతో బంగారం ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. బంగారం ధరలు స్వల్పంగా కొద్దిరోజులు తగ్గినా భారీగా ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను తగ్గించడం కూడా ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది.
పెరిగిన వెండి...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రూ.300లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,700 రూపాయలకు చేరుకుంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,760 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 80,400 రూపాయలుకు చేరుకుంది.
Next Story

