Sun Mar 22 2026 01:33:00 GMT+0530 (India Standard Time)
హైదరాబాదీలకు గుడ్ న్యూస్... స్వల్పంగా తగ్గిన బంగారం
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం స్వల్పంగా తగ్గడం విశేషం.

బంగారం ధరలు ఎప్పుడూ ఒకలా ఉండవు. పెరుగుతూ, తరుగుతూ వినియోగదారులను దుకాణలకు పరుగులు పెట్టిస్తుంటాయి. కరోనా సమయంలోనూ బంగారం ధర పెరగడం ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూవుతాయి. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. కానీ హైదరాబాద్ లో మాత్రం స్వల్పంగా తగ్గడం విశేషం.
ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ప్రస్తుతం 45,100 రూపాయులుగా ఉంది. అదే 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 49,200లు ఉంది. హైదరాబాదీలకు మాత్రం గుడ్ న్యూస్. బంగారం ధర స్వల్పంగా తగ్గిందని, కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

