Sat Jul 02 2022 00:03:03 GMT+0000 (Coordinated Universal Time)
మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

న్యూ ఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో .. కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు పెరగడంతో.. బంగారం ప్రియులు కొనుగోళ్లు చేసేందుకు ఆలోచిస్తున్నారు. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఒక తులం బంగారంపై ఏకంగా రూ.400 తగ్గింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతుండగా.. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670 వద్ద కొనసాగుతోంది.
Next Story