Sat Mar 21 2026 23:52:11 GMT+0530 (India Standard Time)
బంగారం ధర ఈరోజు పెరగలేదు
బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు

బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇది కొంత వినియోగదారులకు ఊరట కల్గించే అంశమే. బంగారం నిన్న బాగా పెరగడంతో కొంత వ్యాపారం కూడా తగ్గుముఖం పట్టింది. ఇటీవల కాలంలో ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుతుండటంతో తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని ఎక్కువ మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈరోజు బంగారం, వెండి ధరలు పెరగకపోవడం కొంత ఊరట కల్గించే అంశమే.
ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,700 రూపాయలుగా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరం 49,850 రూపాయలుగా ఉంది. వెండి కిలో 66,100 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

