Sat Mar 21 2026 20:46:20 GMT+0530 (India Standard Time)
బంగారం ధరలు పైపైకి
బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత మూడురోజులుగా వరసగా బంగారం ధరలు పెరుగుతున్నాయి

బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత మూడురోజులుగా వరసగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాల ప్రకారం బంగారం ధరల్లో పెరుగుదల, తరుగుదల ఉంటుంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరగడమే తప్ప, తగ్గడం అనేది ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వల్పంగా పెరిగినా రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ధరలు ఇలా....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 44,610 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,660 రూపాయలు ఉంది. కిలో వెండి ధర 65,500 రూపాయలుగా ఉంది.
Next Story

